మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Narayaneeyam Dasakam 29 – నారాయణీయం ఏకోనత్రింశదశకమ్


ఏకోనత్రింశదశకమ్ (29) – మోహిన్యవతారం ఆది

ఉద్గచ్ఛతస్తవ కరాదమృతం హరత్సు
దైత్యేషు తానశరణాననునీయ దేవాన్ |
సద్యస్తిరోదధిథ దేవ భవత్ప్రభావా-
దుద్యత్స్వయూథ్యకలహా దితిజా బభూవుః || 29-1 ||

శ్యామాం రుచాపి వయసాపి తనుం తదానీం
ప్రాప్తోఽసి తుఙ్గకుచమణ్డలభఙ్గురాం త్వమ్ |
పీయూషకుంభకలహం పరిముచ్య సర్వే
తృష్ణాకులాః ప్రతియయుస్త్వదురోజకుంభే || 29-2 ||

కా త్వం మృగాక్షి విభజస్వ సుధామిమామి-
త్యారూఢరాగవివశానభియాచతోఽమూన్ |
విశ్వస్యతే మయి కథం కులటాస్మి దైత్యా
ఇత్యాలపన్నపి సువిశ్వసితానతానీః || 29-3 ||

మోదాత్సుధాకలశమేషు దదత్సు సా త్వం
దుశ్చేష్టితం మమ సహధ్వమితి బ్రువాణా |
పఙ్క్తిప్రభేదవినివేశితదేవదైత్యా
లీలావిలాసగతిభిః సమదాః సుధాం తామ్ || 29-4 ||

అస్మాస్వియం ప్రణయినీత్యసురేషు తేషు
జోషం స్థితేష్వథ సమాప్య సుధాం సురేషు |
త్వం భక్తలోకవశగో నిజరూపమేత్య
స్వర్భానుమర్ధపరిపీతసుధం వ్యలావీః || 29-5 ||

త్వత్తః సుధాహరణయోగ్యఫలం పరేషు
దత్త్వా గతే త్వయి సురైః ఖలు తే వ్యగృహ్ణన్ |
ఘోరేఽథ మూర్ఛతి రణే బలిదైత్యమాయా-
వ్యామోహితే సురగణే త్వమిహావిరాసీః || 29-6 ||

త్వం కాలనేమిమథ మాలిముఖాఞ్జఘన్థ
శక్రో జఘాన బలిజంభవలాన్ సపాకాన్ |
శుష్కార్ద్రదుష్కరవధే నముచౌ చ లూనే
ఫేనేన నారదగిరా న్యరుణో రణం త్వమ్ || 29-7 ||

యోషావపుర్దనుజమోహనమాహితం తే
శ్రుత్వా విలోకనకుతూహలవాన్మహేశః |
భూతైస్సమం గిరిజయా చ గతః పదం తే
స్తుత్వాబ్రవీదభిమతం త్వమథో తిరోధాః || 29-8 ||

ఆరామసీమని చ కన్దుకఘాతలీలా
లోలాయమాననయనాం కమనీం మనోజ్ఞామ్ |
త్వామేష వీక్ష్య విగలద్వసనాం మనోభూ-
వేగాదనఙ్గరిపురఙ్గ సమాలిలిఙ్గ || 29-9 ||

భూయోఽపి విద్రుతవతీముపధావ్య దేవో
వీర్యప్రమోక్షవికసత్పరమార్థబోధః |
త్వన్మానితస్తవ మహత్వమువాచ దేవ్యై
తత్తాదృశస్త్వమవ వాతనికేతనాథ || 29-10 ||

ఇతి ఏకోనత్రింశదశకం సమాప్తమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.